ప్రజల పైకి దూసుకొచ్చిన ఉగ్రవాదుల ట్రక్కు..!

ఫ్రాన్స్ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే తమ కళల దినోత్సవం అయిన  బాస్టిల్ డే ఉత్సవాల్లో ఈ సంవత్సరం పెను విషాదం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో బాస్టిల్ డేను పురస్కరించుకొని, బాణ సంచా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రజలు ఈ ఉత్సవాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఇంతలో ఒక్క సారిగా ఒక భారి ట్రక్కు జనాల పైకి దుసుకు వచ్చింది. ట్రక్కులోని వ్యక్తులు ప్రజలపైకి, అక్కడున్న పోలిసులపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 84 మంది మృతి చెందారు, 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని పోలీసులు ఉగ్రవాద దాడిగా అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

bastle day truck bastle day truck.jpg2

Leave a Reply