ప్రయోగానికి సిద్దమవుతున్న జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగష్టు 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదికి మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకు కారణం ఈ చిత్ర షూటింగ్ ఇంకా మిగిలి ఉండడమే అని ప్రకటించారు దర్శకులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే చిత్రాన్ని చుసిన చిత్ర బృందం ఈ చిత్ర మళయాళ వెర్షన్ కు క్లైమాక్స్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మలయాళంలో మోహన్ లాల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని క్లైమాక్స్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే జనతా గ్యారేజ్ తెలుగు వెర్షన్ లో ఒక క్లైమాక్స్, మళయాళ వెర్షన్ లో మరో క్లైమాక్స్ ఉండబోతున్నాయి. ఇటీవల విడుదల అయిన రజనీకాంత్ కబాలి చిత్రానికి కూడా ఇండియన్ వెర్షన్ కు ఒక క్లైమాక్స్, మలేషియన్ వెర్షన్ ను ఒక క్లైమాక్స్ చూపించారు. పాతికేళ్ళ క్రితం వచ్చిన మణిరత్నం దళపతి చిత్రంలో కూడా రెండు రకాల క్లైమాక్స్ చూపించారు. తెలుగు, తమిళ వెర్షన్ లలో మమ్ముట్టి పాత్రను చంపించి, రజనీకాంత్ విలన్లను చంపే విధంగా చూపించారు. అదే మళయాళ వెర్షన్ లో రజనీకాంత్ పాత్రను చంపించి మమ్ముట్టి విలన్లను చంపే విధంగా చూపించారు. ఆయా ప్రాంతాల్లో వారు సూపర్ స్టార్ లుగా ఉండడమే అందుకు కారణం. ఇప్పుడు తాజాగా జనతా గ్యారేజ్ లో కూడా కొరటాల శివ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు.

Leave a Reply