పార్టీ ఒకటే.. కానీ అభిప్రాయాలు రెండు..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే రోజురోజుకి పార్టీలో నాయకుల మధ్య పొంతన సన్నగిల్లుతున్నట్లు ఉంది. ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా అందులో ప్రతిపక్షాలు తప్పుబట్టేందుకు కారణాలు వెతుకుతాయి. కానీ సమాజ హితం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం చేసే పనుల్లో కూడా స్కాములు , స్కీములు అంటూ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదు. తెలంగాణ ప్రభుత్వం చేసే పనులను అప్పుడప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రశంసించారు. అందులో రాజకీయ కోణం కన్నా నాయకత్వ లక్షణమే కనిపించింది అందరికి. కానీ కొందరికి మాత్రం ప్రతిపక్షం లో ఉంటూ ప్రభుత్వాన్ని పొగడటం నచ్చలేదేమో మొన్నామధ్య జానారెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికార్లు చేయించారు ఆ పార్టీ పెద్ద మనుషులే. తర్వాత ఎలగోలా ఆ వివాదం దారి మల్లింది.అయితే తాజాగా ప్రభుత్వం మొదలు పెట్టిన హరిత హారం కార్యకమం ఒక మంచి కార్యక్రమం అని జానారెడ్డి కితాబిచ్చారు. అయితే మరొక కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క  హరిత హారం స్కాము అని కేవలం హరిత హారం ద్వారా కోట్ల మొక్కలు కొనుగోలు చేస్తున్నారని వాటికి లెక్కలు లేవని సుమారు వెయ్యికోట్ల్ల స్కాము అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు కోకొల్లలు జరిగాయి. అవన్నీ స్కాములు అని ఒప్పుకుంటారా? అని ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply