అత్యుత్తమ వెబ్ బ్రౌజర్ ఏదో తెలుసా..??

మనం ఇంటర్నెట్ వినియోగం కోసం బ్రౌజర్ లను వినియోగిస్తుంటాం. అవి ప్రధానంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మొదలైనవి ముఖ్యమైనవి. అయితే వీటిలో ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. దానికి సమాధానం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ గత 20 సంవత్సరాలుగా వాడుకలో ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎడ్జ్ బ్రౌజర్ మిగిలిన అన్ని బ్రౌజర్ ల కన్నా ఎంతో వేగంగా పని చేస్తుంది అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గూగుల్ క్రోమ్ తో పోల్చితే ఎడ్జ్ వాడినప్పుడు 70 శాతం వరకు బ్యాటరీ ఆదా అవుతుందని పేర్కొంది.

Leave a Reply