మొన్న గొల్ఫ్ .. నేడు చెస్..

వైఎసార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆక్కడ రాజకీయాలు అన్ని వదిలేసి కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. మొన్న గోల్ఫ్ ఆట ఆడుతూ ఉన్న ఫోటోను బయటపెట్టిన జగన్ ఇప్పుడు చెస్ ఆడుకుంటున్న ఫోటోను ట్విట్టర్ లో పెట్టాడు. రాజకీయ నాయకులు చదరంగం ఆడడం అనేది సాధారణ విషయం అయితే వారు చెస్ బోర్డుపైన కాకుండా ప్రత్యర్థులతో ప్రజలను పావులుగా మలచుకొని ఆడతారు. కాని జగన్ చెస్ బోర్డుపై ఆడడంతో ఆయన ప్రత్యర్థులు జగన్ కు బోర్డుపై మాత్రమే ఆడతాడని, ప్రజాక్షేత్రంలో చదరంగం ఆడలేదని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ అభిమానులు మాత్రం జగన్ బోర్డుపైనే కాదు ప్రజాక్షేత్రంలో కూడా చదరంగం బాగా ఆడతారని, అయితే ప్రత్యర్థులు వెన్నుపోట్లతో ఆయనను ఓడించారని విమర్శించారు.

Leave a Reply