విచారణకు సిద్దం కావాల్సిందే..!

వోటుకు నోటు కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విచారించాలని ఎసిబి ఆదేశాలిచ్చింది.ఈ నెల 29వ తేదీలోగా విచారణ నివేదిక పూర్తిగా అందించాలని కోరింది.ఇదిలా ఉండగా తనను విచారించవద్దని చంద్రబాబు తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు.అయితే ఈ నెల 29లోగా చంద్రబాబు ను విచారించి ప్రధానంగా కారణమైన వారిని శిక్షార్హులు చేయాలనీ ప్రతి పక్షాలు ఇటు తెలంగాణ అధికార పక్షం న్యాయస్థానాన్ని కోరుతున్నాయి.ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో విమర్శలు చేసారు. చంద్రబాబు ఎప్పుడు తనను తానూ నిప్పు అంటారని ఒకవేళ ఆయన నిప్పు అయితే వోటుకు నోటు కేసులో విచారణకు ఎందుకు సిద్ధంగా లేరని ప్రశ్నించారు. ఒకవేళ విచారణకు సిద్దపడి ఉంటే తమ న్యాయవాదుల తరపున పిటిషన్ ఎందుకు వేయించారని అడిగారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయిన వోటుకు నోటు కేసులో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..

Leave a Reply