తెలుగుదేశం ఆరిపోయే దీపం..!

వైఎసార్సీపీ శాసనసభ్యురాలు రోజా అధికార తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. వైకాపా నాయకులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతున్నారు అని రోజా ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం జాతరలో తనపై దాడి చేసిన వారిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలు ప్రజలకు తెలిసిపోయాయి అని, 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని, అప్పటి వరకు వైఎసార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఓర్పుతో పని చేయాలని రోజా సూచించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, టీడీపీ ఆరిపోయే దీపం అని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని రోజా పేర్కొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని రోజా తెలిపారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని రోజా పిలుపునిచ్చారు.

Leave a Reply