ఆప్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్దూ..!

త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల ముందు బిజెపికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ బిజెపికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే సిద్దూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. పంజాబ్లో జరుగనున్న ఎన్నికల్లో అకాలీదళ్ తో బిజెపి పొత్తు పెట్టుకోవడాన్ని సిద్దూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే భాజాపా అధిష్టానం మాత్రం అకాలీదళ్ తో పొత్తు కొనసాగించడానికే సిద్దపదడంతో సిద్దూ రాజీనామా చేశారు. ఎంపి పదవితో పాటూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. మరోవైపు పంజాబ్ లో అధికారంలోకి రావాలని ఉత్సాహ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఆయన వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కనపడుతుంది. ఆ పార్టీ తరపున సిద్దూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సిద్దూ ఆప్ లోకి వెళ్తారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. మరి ఈ సారి సిద్దూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave a Reply