తెలంగాణ రాష్ట్ర కాటన్ గా కెసిఆర్ మారతారా?

గతంలో తమ అభిమాన నాయకుడి మీద అభిమానాన్ని చూపెట్టడానికి విగ్రహాలు పెట్టడం ఉత్తరాది రాష్ట్రాల్లో, తమిళనాడులో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఆ ట్రెండ్ తెలంగాణాకు కుడా పాకింది. మంథని ఎమెల్యే పుట్టా మధు, మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర కెసిఆర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఏర్పాట్లు చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ధవలేశ్వరం డ్యామ్ దగ్గర సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఏర్పాటు చేసిన విధంగా మేడిగడ్డ దగ్గర కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కెసిఆర్ ని కాటన్ తో పోల్చడం సరికాదు అని ఆయన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయన జ్ఞాపకంగా ధవళేస్వరం వద్ద ఆయన విగ్రహం పెట్టారు కానీ శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టినందుకు కాదు. అంతటి ఘన కీర్తిని తానూ సొంతం చేస్కోవాలంటే తాను కూడా కట్టుదిట్టంగా అవినీతికి పాల్పడకుండా ప్రాజెక్టులను కట్టి చూపిస్తే అప్పుడు తామే విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేస్తామని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇది ఒక ప్రాజెక్ట్ లేదా ఒక చిన్న పథకం పూర్తి చేసినందుకో శంకుస్థాపన చేసినందుకో కాదు అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణ సారధ్యాన్ని తన భుజాలపై మోస్తూ తెలంగాణను కరువు రహిత ప్రాంతంగా చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషికి గుర్తుగా చేస్తున్నదే అని అభిమానులు గట్టిగా సమాధానం ఇచ్చారు.

Leave a Reply