అస్తవ్యస్తమైన జన జీవనం…

హైదరాబాద్ లో నిన్న రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర జీవన స్తంభించి పోయి, జన జీవనం అస్త వ్యస్తంగా తయారయింది. భారీగా కురుస్తున్న వర్షాల అనేక పురాతన కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. అనేక పాత ఇళ్ళు కూలిపోవడం వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు నగరంలో ఇళ్ళు కూలడం వల్ల 7గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

Leave a Reply