తీవ్ర ఆందోళనలో ప్రజలు…

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం లోని నాలాలు ఉప్పొంగిపోతున్నాయి. అందులో ఎక్కువ శాతం నీరు హుస్సేన్ సాగర్ లో కలుస్తుండడంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఏకంగా నాలుగు అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. దాంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు అపమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే నగరంలో పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. రాజ్ భవన్ సమీపంలో రైలు పట్టాలు నీట మునగడంతో, పలు రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave a Reply