విమానంలో 29 మంది ప్రయాణికులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం అదృశ్యం అయ్యింది. తారంబరం నుండి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తున్న విమానం అదృశ్యం అయ్యింది. చెన్నైలో ఇవాళ ఉదయం 7.45 గంటలకు టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఫోర్స్ రవాణ విభాగానికి చెందిన ఏఎన్-33 విమానానికి ఉదయం 8.12 గంటల సమయంలో చెన్నై ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.ఈ విమానం ఉదయం 11.20 గంటలకు పోర్ట్ బ్లెయిర్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ విమానంలో ఎమర్జెన్సీ బీకన్ లొకెటర్ ఉంది. ఒక వేళ విమానం కూలిపోతే అది సమాచారం ఇచ్చేదని అధికారులు పేర్కొంటున్నారు. కనిపించకుండా పోయిన విమానం కోసం ఎయిర్ ఫోర్సు, కోస్ట్ గార్డ్, నేవీకి చెందిన అధికారులు తీవ్రంగా వెతుకుతున్నారు. బంగాళాఖాతంలో ఏమైనా కులిందేమో అని తెలుసుకోవడానికి నేవీ అధికారులు విమానాన్ని, నాలుగు నౌకలను కూడా పంపించారు. ఈ విమానంలో సిబ్బంది సహా 29 మంది అధికారులు ఉన్నారు.

Leave a Reply