రజనీ కాంత్ కబాలిలో కొత్త ట్విస్ట్..

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం కబాలి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. భారి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలోని ఒక సన్నివేశంలో రజనీ కాంత్ చదువుతున్న ఒక పుస్తకం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే రజనీ కాంత్ ఈ చిత్రంలో ‘My Father is Balayya’ అనే పుస్తకాన్ని చదువుతుంటారు. ఈ పుస్తకాన్ని రాసింది కరీంనగర్ జిల్లాకు చెందిన వైబి సత్యనారాయణ. ఆయన తెలుగులో ‘మా నాయిన బాలయ్య‘ అనే పేరుతో వ్రాశారు. నాలుగు తరాల వ్యక్తుల మనస్తత్వాన్ని అధ్బుతంగా ఆవిష్కరించిన పుస్తకం. పెద్దగా ప్రజాదరణను నోచుకోలేదు. కాని ఇప్పుడు రజనీ కాంత్  తన సినిమాలో ఈ పుస్తకాన్ని చూపించడం వల్ల ఈ పుస్తకానికి అనుహ్య౦గా ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

my father is balayya book in kabali

Leave a Reply