అప్పుడే దేశం ముందుకు పోతుంది..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి పనితీరును రాష్ట్రపతి మెచ్చుకున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల సమయలో తప్ప మిగతా అన్ని సమయాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఆ విషయంలో చంద్రబాబు దేశంలోని అన్ని రాజకీయ నాయకుల కంటే ముందు వరుసలో ఉన్నారని ప్రణభ్ ముఖర్జీ తెలిపారు. చంద్రబాబు ప్రతి అంశంలో ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉంటారని, దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబులా పని చేస్తే దేశం ముందుకుపోతుందని రాష్ట్రపతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రపతిని శాలువతో సత్కరించారు. ఆగష్టు 12న ప్రారంభం అయ్యే కృష్ణా పుష్కరాలకు ఆహ్వానం అందించారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందిన్దిన్చినట్లు రాష్ట్రపతి తెలిపారు.

Leave a Reply