తెలంగాణలో సరికొత్త రాజకీయ శక్తి..!

టిజేఏసి చైర్మన్ కోదండరామ మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కోదండరాం ఇప్పుడు మరోసారి తీవ్ర స్వరంతో విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రెండు సార్లు అపాయింట్మెంట్ కోరిన ఇవ్వలేదని, కాని తాము మాత్రం తమ సూచనలను, సలహాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నామని, అయినా కుడా తెరాస,నేతలు మంత్రులు తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. తనపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనని, జేఏసినే మాట్లాడుతుందని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలు,ప్రాంతాల మధ్య ఆర్ధిక వ్యత్యాసం పెరిగిపోతుందనే తాను చెప్పానని, అందులో తప్పేం ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు.

టీజేఏసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ రోజు జరిగే సమావేశంలో రెండేళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలనపై లోతైన చర్చతో పాటు, అనేక కీలక విషయాలను చర్చించబోతున్నట్లు సమాచారం. అదే విధంగా జేఏసిని ఇంకా ఉద్యమ పథంలోనే నడపాలా,లేక రాజకీయ రూపును ఇవ్వాలా అనేది ఈ సమావేశంలో నిర్ణయించబోతున్నాట్లు సమాచారం. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాల కోసం కుడా చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply