నక్సలైట్లపై తీవ్ర చర్యలు – కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్

దేశంలో పెరిగిపోతున్న నక్సలిజం సమస్యపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. దేశం నుండి నక్సలిజంని తొందరలోనే పూర్తిగా తుడిచి వేస్తామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఝార్ఖండ్ లో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్, నక్సల్ ఏరివేతకు ఝార్ఖండ్ ప్రభుత్వం అనుసరిస్తున్న జాగ్వార్ విధానాన్ని ఆయన ప్రశంసించారు. జాగ్వార్ కు నక్సలిజాన్ని తుదిచివేయగల శక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నక్సలైట్ల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తున్నాయి అని, నక్సలైట్ల అణచివేతకు పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Leave a Reply