పసివాడి ప్రాణానికి .. కులానికి సంబంధం ఉందా?

మనిషి మనుగడకోసం బ్రతకనేర్చిన బుద్దిశాలిగా అన్ని విషయాలను కనిపెట్టి తనకు సౌకర్యంగా మార్చుకుని నావాడు..నా కులం నావాళ్ళు.. నా ప్రాంతం అంటూ నలుగురిలో కలవకుండా ఉంటే నిన్ను మోయడానికి నీవాళ్ళు నలుగురు నీ వెనుక ఉండరు. అన్నారొక కవి. అయితే ఇంత చేసి ఇన్ని సాధించి చివరికి డబ్బు, సౌకర్యం,సంపద వరకే ఉన్న పరిమితులను కులం విషయంలో కూడా పెంచి పోషించి విష వృక్షాలుగా మనసులో నాటుకుపోయాయనడానికి ఇదే నిదర్శనం.  మూడేళ్ళ పసివాడికి ప్రాణాలమీదకు వచ్చి రక్తం అవసరమైనా ఈ కులం వల్ల రక్తమే కావాలని ట్విట్టర్ లో అడిగే స్థాయిలో ఉన్నదా నేటి సమాజం.. రక్తం దొరికితే చాలు భగవంతుడా నీకు కృతఙ్ఞతలు అని రక్త దానం చేసినవాళ్ళకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమని తమలోని మానవత్వానికి మురిసిపోవాలి కానీ నా కులం ఉన్న వల్ల రక్తం కావాలని పట్టు బడితే జరిగే నష్టం ఒక ప్రాణానికి తప్ప నీ మనసులో నువ్వు ప్రాధాన్యమిస్తున్న నీ కులానికి కాదు.ఇప్పటికీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే దేశ ప్రగతి కులాల కుమ్ములాటలోనే కొట్టుమిట్టాడుతుంది గాని అది ఎప్పటికి సాధ్యం కాదనిపిస్తుంది.

Leave a Reply