ఒంటరినైపోయాను.. నేనేవ్వరికేమి కాను… అంటారా?

అమ్మ లేదు..నాన్న లేదు..అక్క లేదు.. అన్న లేడు .. ఏక్ నిరంజన్ అనే పాట చక్కగా సరిపోతుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఓటు కి నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి . ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 100మంది యువకులను బరిలోకి దించి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు తెరాస నేతలకి అహంకారం దించుతా అని ఆమధ్య ఒక బహిరంగ సభలో అయన ప్రకటించిన విషయం విదితమే . ఐతే తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచినా 15మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే అధికార తెరాస పార్టీలో 12మంది ఎమ్మెల్యేలు చేరగా మిగిలిన ముగ్గురు అయిన అర్ కృష్ణయ్య ఇప్పటికే త్వరలో తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి త్వరలో ఇరు రాష్ట్రాలలోని ఉన్న బిసి కులాల సంక్షేమం కోసం పోరాటం చెయ్యడానికి వీలుగా త్వరలోనే పార్టీ పెడతా ఇప్పటికే ప్రకటించాడు కూడా . అంటే అయన త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యడం ఖాయం అన్నమాట . ఇకపోతే రెండో ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సండ్ర వెంకటవీరయ్య త్వరలోనే తెరాస పార్టీలో చేరతారని ఖమ్మంలో జోరుగా ప్రచారం జరుగుతుంది . ఎందుకంటే తనకి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మంత్రి తుమ్మల ఇప్పటికే అధికార తెరాస పార్టీలో చక్రం తిప్పుతుండగా తను అయన ముందు ఖమ్మంలో మరల గెలిచే అవకాశం లేకపోవడం అంతే కాక ముఖ్యమంత్రి ,తమ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు మోసాలు తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం తో ఎమ్మెల్యే సండ్ర కి తనకి తెదేపా లో రాజకీయ భవిష్యత్  లేదు అని భయం పట్టుకోవడం తో అయన తెరాస లో చేరడం ఖాయం . ఇక మిగిలింది ఓన్లీ వన్ అండ్ వన్ పర్సన్ అదే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి . వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కి ఒక్క ఎమ్మెల్యే సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని ఇప్పటికే అర్ధమైంది.తెలంగాణ తెదేపాలో ఎమ్మెల్యేలందరూ అధికార తెరాస లో చేరగా రేవంత్ రెడ్డి ఒంటరి అవుతాడని తాము ఏమి చేయాలో అర్డంకావట్లేదని ఆ పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ మారడంపై యోచనలో ఉన్నారంట..

Leave a Reply